కోల్ కతా (నిజాం )ప్యాలెస్ హిస్టరీ: దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది...!

కోల్ కతా  (నిజాం )ప్యాలెస్ హిస్టరీ:  దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది...!

ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలకు, ఐరోపా వలస పాలనకుకేంద్రం కోల్​కతా మహానగరం. పాలనాకేంద్రం ఈ నగరం నుంచి ఢిల్లీకి మారినాదేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. బెంగాల్ విభజన, దేశ విభజనకు ముందు రోజుల్లో జరిగిన భారత రాజకీయాలకు కోల్​కతా ప్రధాన కేంద్రం.ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ను నిర్మించిన నిజాం అయిదేళ్లకే కోల్​కతాలో మరో ప్యాలస్ ను ఎందుకు సిద్ధం చేసుకున్నాడో ఓ మిస్టరీ. అది చరిత్రకెక్కని హిస్టరీ!  ఈస్టోరీలో దాని గురించి తెలుసుకుందాం. . !

నిజాం నవాబుల దర్పంలాగే ఒకనాటి కోల్​కతా నగరంలో వాళ్ల వైభవానికి ప్రతీకగా ఉండేది 'సాబా ప్యాలస్'. ఈ ప్యాలస్ వున్న వీధిని ఇప్పుడు ఆచార్య జేసీ బోస్ రోడ్' అని పిలుస్తున్నారు. ఈ నిజాం ప్యాలస్, హౌరా రైల్వే స్టేషన్​ కు  ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులో 20 నిమిషాల ప్రయాణం. కోల్​కతా చరిత్రలో ఎంతో ప్రాధాన్యత వున్న ఈ ప్యాలస్ ను ఆ పేరుతో పిలిస్తే ఇప్పుడెవ్వరూ కనుక్కోలేరు. దాని పేరిప్పుడు "నిజాం ప్యాలెస్'గా మారిపోయింది. ఈ రెండు పేర్లకు ముందు ఈ భవనానికి 'గల్ఫాన్ పార్క్' అని పేరు! ముచ్చటైన మూడు పేర్లున్న ఈ భవనానికి మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. మూడు రాజ్యాలతో చారిత్రక అనుబంధం ఉంది.

కలకత్తా తాజ్ మహల్

జీవిత సహచరిపట్ల బతికుండగానే కాదు. మరణించిన తర్వాతా ప్రేమను చాటుకున్న ప్రేమికులెందరో.... వాళ్లలో ఒకడు 'జొహాన్నస్ కారపియెట్ గల్తాన్' అనే ఆర్మేనియన్. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు రోజుల్లో కోల్​కతా నగరంలో ఉండేవాడాయన. ఆయన సంపన్న వ్యాపారి... భార్యకు జ్ఞాపకంగా ఈ భవనం కట్టిండు. దీనిని 19వ శతాబ్దం తొలినాళ్లలో నిర్మించిండు. దీనికి 'గల్తాన్ పార్క్' అని పేరు పెట్టిండు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోఈ భవనాన్ని ఎనిమిదో కింగ్ జార్జ్ ఎడ్వర్డ్ హాస్పిటల్​ గా  ఉపయోగించాడు. విలాస జీవితాన్ని ఆస్వాదించే నిజాం తన రాజకీయ అవసరాల కోసం ఢిల్లీ నగరంలో హైదరాబాద్ హౌస్ నిర్మించాడు. కోల్​కతా నగరంతోనూ సంబంధాలుండేలా ఏడో నిజాం కోల్​కతాలో ఒక ప్యాలెస్ ఉండాలని భావించాడు. అదే సమయానికి 'గల్సాన్ పార్క్'ని అమ్మాలని నిర్ణయించారు. ఇదే అదనుగా భావించిన నిజాం 1933లో దానిని కొనుగోలు చేసిండు.

చేజారిన అధికారం

గల్గిస్తాన్ పార్క్ ను  కొనుగోలు చేసిన తర్వాత తన అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా
భవనానికి కొత్త హంగులద్దాడు నిజాం.ఎత్తయిన దోమ్​లతో అందమైన టైల్స్ నిజాం ప్యాలస్ కనువిందు చేసేది. భవనం అందాలకు తగ్గట్టే నిజాం దీనికి 'సాబా ప్యాలస్ అని కొత్త పేరు పెట్టాడు. నిజాం గెస్ట్ హౌస్ గా దీనిని ఎక్కువ కాలం వినియోగించారు. నిజాం, అతని ప్రతినిధులు, అతిథులు ఈ భవనంలో విడిది చేసేవాళ్లు. 1939 నుంచి 1945 మధ్య కాలంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధానికి ఆరేళ్ల ముందు కోల్​కతాలో నిజాం పాలకులు ఓ భవనం ఎందుకు కొనుగోలు చేసిండనేది సమాధానం లేదు. నిజాం ఢిల్లీ పాలకుల సైనిక సహకారం కోరడం, ఆపరేషన్ పోలో తర్వాత నిజాం సర్వాధికారం స్వల్పంగా చేజారింది.

Also Read : రాజాపేట సంస్థానం.. రాజసానికి ప్రతిరూపం

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ చేజిక్కింది. దానితోపాటే సాబా ప్యాలస్ కూడా ఢిల్లీ చేతుల్లోకి పోయింది. అయినా నిజాంల జ్ఞాపకంగా 'నిజాం ప్యాలస్' పేరుతోనే అది ఇప్పటికీ కోల్​కతా ప్రజల నోళ్లలో నానుతోంది.

తెలంగాణ ఆస్తి.. బెంగాలీల వారసత్వం

నిజాం ప్యాలస్ లో రెండు అంతస్తులను భారత ప్రభుత్వ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ కు కేటాయించారు. చిన్న టైల్స్​ లో  ఒకప్పుడు సుందరంగా కనిపించే ఈ సంపన్న భవనం ఇప్పుడు పెచ్చులూడిన గోడలు పోల్కా డాట్ చీరల్ని గుర్తుచేస్తున్నాయి. టేకు కలపతో, ఆర్మేనియన్ కళాత్మకత ఉట్టిపడేలా నిర్మించిన తలుపులు, కిటీకీలు ఈ ప్యాలస్ ప్రత్యేకత. నిర్వహణ సరిగా లేక ఆ కళానైపుణ్యమంతా చెదలుపట్టిపోయింది.. ఇప్పుడీ ప్యాలస్​కు  వచ్చే వారికి అల్యూమినియం ద్వారాలు స్వాగతాలు పలుకుతున్నాయి.. కూలే స్థితిలో ఉన్న ఈ భవనాన్ని కాపాడాలని ఇంటాక్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు ఉద్యమించడంతో ప్రభుత్వం నిజాం ప్యాలస్ సంరక్షణకు నడుం కట్టింది. కోల్​కతా  నగరంలోని పరిరక్షిత వారసత్వ కట్టడాల జాబితాలో దీనిని చేర్చింది. ప్యాలెస్ కూలిపోకుండా శిథిలమైన కప్పు ఉన్నచోట ఇనుప స్థంభాలను నిలిపారు.

నిజాంల నైజం

భూలోక సంపన్నుడైన ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ విలాసాలకు మరో పేరు. నిర్మాణ కళ, ఆధునిక దృక్పథం వున్న నిజాం పూర్వపు రాజుల జీవన శైలిని అనుసరించకుండా ఐరోపా నాగరికతను అంతఃపురాల్లోకి అహ్వానించిండు. ఆ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించిన ఆధునికత దర్బార్ హాల్ వేదికగా వివిధ రంగాల్లోకి విస్తరించింది. 

నిజాం పాలనా కాలంలో నిర్మించిన అనేక నిర్మాణాలెన్నో ఆ విలాసాలతో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.. హైదరాబాద్ ఇమేజ్​ కు  ఆ కట్టడాలే ఇప్పటికీ ప్రతినిధులు. ఉస్మానియా దవాఖాన, ఆర్ట్స్ కాలేజ్, మహబూబియా స్కూల్, ఆలియా స్కూల్, పాత సెక్రటేరియట్ ఇవన్నీ ఆనాడు నిర్మించిన అద్భుతాలే! ఇక వ్యక్తిగత అవసరాల కోసం ఆయన పూర్వీకులు నిర్మించిన పురానా హవేలీ ప్యాలస్, చౌమహల్లా ప్యాలస్, తాను మెచ్చి కొనుగోలు చేసిన ఫలక్ నుమా ప్యాలస్, కింగ్ కోఠి ప్యాలస్ విలాసాలకు చిరునామాలు ఉన్నాయి.